Vastu tips: శంకుస్థాపన ఎప్పడు చేయాలి.. నైరుతిదిక్కులో నిర్మాణాలు ఎలా ఉండాలి..!

Vastu tips:  శంకుస్థాపన ఎప్పడు చేయాలి.. నైరుతిదిక్కులో నిర్మాణాలు ఎలా ఉండాలి..!

ఇల్లు కట్టుకోవాలంటే వాస్తు ప్రకారం నిర్మించాలి.  మొదట శంకుస్థాపన చేసి తరువాత ప్లాన్​ ప్రకారం కట్టుకోవాలి.  నైరుతి మూల నిర్మాణం ఎలా ఉండాలి.. శంకుస్థాపన చేసేటప్పుడు తీసుకోవలసిర జాగ్రత్తలు ఏమిటి.. మొదలగు విషయాల గురించి వాస్తు సిద్దాంతి కాశీనాథుని శ్రీనివాస్​ ఏమంటున్నారో తెలుసుకుందాం.

ప్రశ్న: సాయంత్రం పూట ..సాయంసంధ్యా సమయంలో ఇంటికి శంకుస్థాపన చేశాం. ఇది కరక్టేనా? ఏ టైమ్ లో శంకుస్థాపన చేసుకుంటే బాగుంటుంది?

జవాబు: సాయంత్రం పూట శంకుస్థాపన చేయకూడదు. చిన్న ఇల్లైనా, పెద్దదైనా సూర్యోదయానికి ముందు లేదా ఉదయం పూట మాత్రమే చేయడం సంప్రదాయంగా వస్తోంది. ఈ విషయంలో మీ ఇంటి పురోహితుడిని అడిగి ఆయన సలహా తీసుకోండి. 

ప్రశ్న: నైరుతి వైపు బెడ్రూమ్ లేదా స్టోర్ రూమ్... ఏది ఏర్పాటు చేసుకుంటే మంచిది? నైరుతి దిక్కు లో బాత్రూమ్ కట్టుకోవచ్చా

జవాబు: నైరుతి వైపు బెడ్రూమ్, స్టోర్ రూమ్.. రెండింట్లో ఏదైనా కట్టుకోవచ్చు. అయితే, అటువైపు ప్రత్యేకంగా బాత్రూమ్ కట్టుకోకూడదు. దక్షిణ సెంటర్లో కామన్ బాత్రూమ్ ఉండొచ్చు. ఒకవేళ నైరుతి బెడ్​ రూమ్​ లో  బాత్రూమ్ కావాలంటే ఆగ్నేయం లేదా వాయువ్యంలో అయినా కట్టుకోవచ్చు.